జిఎస్ టీ రిటర్న్‌లో మరిన్ని మార్పులు

ABN , First Publish Date - 2022-05-23T08:46:12+05:30 IST

వ్యాపార సంస్థ లు నెలనెలా సమర్పించే ‘జీఎ స్‌టీఆర్‌-3బీ’ రిటర్న్‌కి మరిన్ని మెరుగులుదిద్దాలని ప్రభు త్వం భావిస్తోంది.

జిఎస్ టీ రిటర్న్‌లో మరిన్ని మార్పులు

న్యూఢిల్లీ: వ్యాపార సంస్థ లు నెలనెలా సమర్పించే ‘జీఎ స్‌టీఆర్‌-3బీ’ రిటర్న్‌కి మరిన్ని మెరుగులుదిద్దాలని ప్రభు త్వం భావిస్తోంది. నకిలీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) చెల్లింపుల క్లెయిమ్‌లకు చెక్‌  పెట్టేందుకు ఇది అవసరమని అధికార వర్గాలు చెప్పాయి. వచ్చే నెలలో జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశం ఈ మార్పులకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మార్పులతో బోగస్‌ క్లెయిమ్‌లకు చెక్‌పెట్టడంతో పాటు నిజమైన క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించవచ్చని అధికార వర్గాలు చెప్పాయి. ఇందుకోసం జీఎ్‌సటీ మండలి సమావేశానికి  ముందే సవరించిన జీఎ్‌సటీఆర్‌-3బీ ఫారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికార వర్గాలు యోచిస్తున్నాయి. 

Updated Date - 2022-05-23T08:46:12+05:30 IST