ఐగేర్‌ సొల్యూషన్స్‌కు రూ.65 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2022-12-31T03:20:19+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఐవేర్‌ టెక్నాలజీ సొల్యూషన్ల కంపెనీ ఐగేర్‌ ఆప్టిక్స్‌ ఇండియాకు ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌, వెంచర్‌ ఈ్‌స్ట నుంచి 82 లక్షల డాలర్ల (దాదాపు రూ.65 కోట్లు) నిధులు లభించాయి.

ఐగేర్‌ సొల్యూషన్స్‌కు రూ.65 కోట్ల నిధులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఐవేర్‌ టెక్నాలజీ సొల్యూషన్ల కంపెనీ ఐగేర్‌ ఆప్టిక్స్‌ ఇండియాకు ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌, వెంచర్‌ ఈ్‌స్ట నుంచి 82 లక్షల డాలర్ల (దాదాపు రూ.65 కోట్లు) నిధులు లభించాయి. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్‌ 3.5 కోట్ల డాలర్ల మేరకు ఉందని.. 2027 నాటికి దీన్ని 15 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐగేర్‌ ఆప్టిక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ్‌ పిలా తెలిపారు. నాణ్యమైన ఐవేర్‌, ఐకేర్‌ సొల్యూషన్లను అందించడానికి దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని తెలిపారు. సాధారణ రిటైల్‌ ఆప్టికల్‌ షోరూమ్‌లకు కూడా అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నామని వివరించారు.

Updated Date - 2022-12-31T03:20:19+05:30 IST

Read more