Flipkart: పండగ సీజన్‌, హాలిడేస్‌లో ప్రయాణాలు చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌‌పై అదిరిపోయే ఫీచర్..

ABN , First Publish Date - 2022-09-07T17:33:46+05:30 IST

నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లకు చేరువైన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart).. మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది.

Flipkart: పండగ సీజన్‌, హాలిడేస్‌లో ప్రయాణాలు చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌‌పై అదిరిపోయే ఫీచర్..

న్యూఢిల్లీ: నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లకు చేరువైన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart).. మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఆతిథ్యరంగంలో తన వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యంగా కొత్తగా హోటల్ బుకింగ్ ఫీచర్‌ ‘ఫ్లిప్‌కార్ట్ హోటల్స్’(Flipkart Hotels)ను ఆవిష్కరించింది. భారత్‌తోపాటు విదేశాల్లోని హోటల్స్‌ను కూడా సులభంగా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. హోటల్‌ బుకింగ్స్‌తోపాటు రానున్న ఫెస్టివల్ సీజన్‌, హాలిడేస్‌లో ప్రయాణాలపై తగ్గింపు ఆఫర్లు, డీల్స్‌ను కస్టమర్లు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌, యాప్‌లపై ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. 


ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌పై దేశీయంగా, అంతర్జాతీయంగా మొత్తం 3 లక్షల హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కాగా ఆతిథ్యరంగంలో విస్తరించాలనుకుంటున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ‘క్లియర్‌ట్రిప్’ (Cleartrip)ను కొనుగోలు చేసింది. డిజిటల్ వాణిజ్యంలో తన వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే క్లియర్‌ట్రిప్ ఏపీఐ(Application Programming Interface) ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారణంగానే చౌకగా ప్రయాణం చేసే ఆప్షన్లను కస్టమర్లకు అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌పై యాడ్ ఆన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ట్రావెల్, బుకింగ్ సంబంధిత పాలసీలు, సులభ ఈఎంఐ ఆప్షన్లతోపాటు ప్రయాణ అనుభూతిని బడ్జెట్ ఫ్రెండ్లీగా అందించాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది.


ట్రావెల్ కస్టమర్లు, ఆతిథ్య రంగంలో క్లియర్‌ట్రిప్‌కు ఉన్న అనుభవం ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌కు ఉపయోగపడే అవకాశాలున్నాయి. నిరంతరాయ హోటల్స్ బుకింగ్స్ సౌకర్యంతోపాటు మెసేజుల ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అంతేకాకుండా కస్టమర్లకు సమాచారం, సందేహాలకు సమాధానం ఇచ్చేందుకుగానూ కస్టమర్ కేర్ సర్వీసును కూడా ఏర్పాటు చేసింది. థర్డ్ పార్టీ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. కాగా కరోనా తర్వాత ప్రస్తుత ఏడాది 2022 ఆతిథ్యరంగానికి చాలా ముఖ్యంకానుంది. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ ఊపందుకోవడంలో ఈ ఏడాది చాలా కీలకం కానుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.

Updated Date - 2022-09-07T17:33:46+05:30 IST