Flipkart Big Billion Days sale 2022: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది.. తేదీ వివరాలు ఇవే.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ !..
ABN , First Publish Date - 2022-09-04T22:14:24+05:30 IST
ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా షాపింగ్ ఫెస్టివల్ ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’ (Flipkart Big Billion Days sale) కు అంతా సిద్ధమైంది.
న్యూఢిల్లీ : ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా షాపింగ్ ఫెస్టివల్ ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’ (Flipkart Big Billion Days sale) కు అంతా సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటనైతే రాలేదు కానీ ఈ నెల చివరన(సెప్టెంబర్) బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభమయ్యే సూచనలున్నాయి. సెప్టెంబర్ 23న మొదలయ్యి.. సెప్టెంబర్ 30న ముగియనుందని టిప్‌స్టార్ అభిషేక్ యాదవ్(Abhishek Yadav) ట్విటర్‌లో సంకేతమిచ్చాడు. ఫ్లిప్‌కార్ట్ సేల్స్ త్వరలోనే ప్రారంభమవనున్నాయనే ఫ్లిప్‌కార్ట్ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ పోస్టర్‌పై మహింద్రా సింగ్ ధోనీ(Mahindra singh Dhoni), అలియా భట్(Alia But) ఫొటోలు ఉన్నాయి. మరోవైపు అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ షాపింగ్ ఫెస్టివల్’ కూడా ఇదే రోజుల్లో షురూ అవ్వొచ్చని అభిషేక్ యాదవ్ పేర్కొన్నాడు.
ఈసారి ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఐఫోన్ 13(iPhone 13), ఐఫోన్ 12(iPhone 12) సేల్స్‌పై భారీ డీల్స్(Deals), డిస్కౌంట్లు(Discounts) లభించే అవకాశం ఉంది. డిస్కౌంట్లతోపాటు కొన్ని బ్యాంకులతో కలిసి కొన్ని సేల్స్‌పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఐసీఐసీఐ బ్యాంకు లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉన్నవారు కొన్ని ప్రత్యేక ప్రొడక్టులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. నో-కాస్ట్ ఈఎంఐతోపాటు స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్చేంజీ ఆఫర్లు ఉండనున్నాయి. ఐఫోన్‌తోపాటు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్లు అయిన రియల్‌మీ, పోకో, వివో, యాపిల్, సామ్‌సంగ్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించే అవకాశాలున్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, టీవీలు, అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాలున్నాయి.
ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ?
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 ఈ నెల 7న(బుధవారం) మార్కెట్లోకి విడుదల చేయనుంది. కాబట్టి గత ట్రెండ్స్‌ను పరిగణలోకి తీసుకుంటే ఐఫోన్ 13, ఐఫోన్ 12 రేట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. కాబట్టి ఐఫోన్ 14 అవసరం లేదులే అనుకుంటే మంచి డిస్కౌంట్‌పై ఐఫోన్ 13ను మంచి డిస్కౌంట్‌తో సాధించవచ్చు. ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌పై ప్రస్తుతం రూ.69,999గా ఉంది. 128జీబీ వేరియెంట్ ఫోన్ రేటు రూ.79,999 నుంచి ఈ స్థాయికి దిగొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.2000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్లపై రూ.19,999 ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అయితే రూ.19 వేల వరకు తగ్గుతుందా అంటే గ్యారంటీగా చెప్పలేం. పాత ఫోన్ మోడల్, ఫోన్ కండీషన్ని బట్టి ఎక్చ్సేంజీ రేటు ఆధారపడి ఉంటుంది. పాతవి ఐఫోన్ 11 లేదా ఐఫోన్ 12 అయ్యుంటే డిస్కౌంట్ అధికంగా ఉండే ఛాన్స్ ఉంటుంది.
