మార్కెట్లకు ఫెడ్‌ సెగ

ABN , First Publish Date - 2022-12-16T00:39:46+05:30 IST

రెండు రోజుల వరుస లాభాల తర్వాత ఈక్విటీ సూచీలు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 878.88 పాయింట్లు క్షీణించి 61799.03 వద్దకు జారుకుంది...

మార్కెట్లకు ఫెడ్‌ సెగ

సెన్సెక్స్‌ 879 పాయింట్లు పతనం

18,400 స్థాయికి జారిన నిఫ్టీ

ముంబై: రెండు రోజుల వరుస లాభాల తర్వాత ఈక్విటీ సూచీలు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 878.88 పాయింట్లు క్షీణించి 61799.03 వద్దకు జారుకుంది. నిఫ్టీ 245.40 పాయింట్ల నష్టంతో 18414.90 వద్ద క్లోజైంది. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను మరో 0.50 శాతం పెంచడంతోపాటు ధరలపై పోరులో మున్ముందు మరిన్ని ‘వడి’్డంపులు తప్పవని సంకేతాలివ్వడంతో గ్లోబల్‌ మార్కెట్లతోపాటు మన దలాల్‌స్ట్రీట్‌లోనూ అమ్మకాలు పోటెత్తాయి.సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా షేరు 3.98 శాతం పతనమై టాప్‌ లూజర్‌గా మిగిలింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.05 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.61 శాతం తగ్గాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 27 పైసలు బలహీనపడి 82.76 వద్ద ముగిసింది.

ఐఆర్‌సీటీసీ వాటా విక్రయానికి భారీ స్పందన

భారత రైల్వే అనుబంధ ఐఆర్‌సీటీసీలో వాటా విక్రయానికి భారీ స్పందన లభించింది. కేంద్రప్రభుత్వం కంపెనీలో 5 శాతం వాటాకు సమానమైన 4 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయానికి పెట్టగా.. తొలిరోజునే సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,800 కోట్ల విలువైన 5.55 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలు చేశారు. శుక్రవారం రిటైల్‌ ఇన్వెస్టర్లకూ ఈ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ప్రభుత్వం ఐఆర్‌సీటీసీ షేరు ధరను రూ.680గా నిర్ణయించింది. బుధవారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు ముగింపు స్థాయి రూ.734.70తో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ. ఐఆర్‌సీటీసీలో కేంద్ర ప్రభుత్వం 67.40 శాతం వాటా కలిగి ఉంది.

ఎలిన్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధర శ్రేణిని రూ.234-247గా నిర్ణయించింది. తద్వారా రూ.475 కోట్ల వరకు సమీకరించా లనుకుంటోంది. కంపెనీ ఐపీఓ ఈనెల 20న ప్రారంభమై 22న ముగియనుంది.

రెండు ఐపీఓలు గురువారంతో ముగిశాయి. అందులో లాండ్‌మార్క్‌ కార్స్‌ ఇష్యూకు 3 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించగా.. అబాన్‌ హోల్డింగ్స్‌ ఇష్యూ సైజుతో పోలిస్తే 1.10 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి.

Updated Date - 2022-12-16T00:39:53+05:30 IST