బయో ఏషియాలో బిల్‌ గేట్స్‌

ABN , First Publish Date - 2022-02-19T08:30:23+05:30 IST

వచ్చే వారం హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏషియా 2022 సదస్సులో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ కూడా పాల్గొంటున్నారు.

బయో ఏషియాలో బిల్‌ గేట్స్‌

మంత్రి కేటీఆర్‌తో చర్చ  


హైదరాబాద్‌ : వచ్చే వారం హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏషియా 2022 సదస్సులో మైక్రోసాఫ్ట్‌ అధినేత  బిల్‌ గేట్స్‌ కూడా పాల్గొంటున్నారు. ఈ సద స్సు సందర్భంగా ఆయన వర్చువల్‌గా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో మాట్లాడనున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, గత రెండేళ్లలో నేర్చుకున్న అనుభవాలు, కొత్త పోకడలపై ఆయన కేటీఆర్‌తో చర్చిస్తారు. బిల్‌ గేట్స్‌తో జరిగే చర్చ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు కేటీఆర్‌ తెలిపారు.

Read more