ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 35% వృద్ధి

ABN , First Publish Date - 2022-09-10T06:22:22+05:30 IST

ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 35.46 శాతం వృద్ధి చెందాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 1తో

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 35% వృద్ధి

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 35.46 శాతం వృద్ధి చెందాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 1తో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సెప్టెంబరు 8 నాటికి ప్రత్యక్ష పన్నుల ద్వారా సమకూరిన స్థూల ఆదాయం రూ.6.48 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ జోరందుకుందనడానికి ఈ వసూళ్లు నిదర్శనంగా నిలిచాయి. రూ.1.19 లక్షల కోట్ల రిఫండ్‌లను మినహాయించగా, నికర వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 30.17 శాతం వృద్ధితో రూ.5.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయం పన్ను (సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను సహా), కార్పొరేట్‌ ట్యాక్స్‌లు ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. 

Updated Date - 2022-09-10T06:22:22+05:30 IST