త్వరలో ఎల్‌ఐసీ ఐపీఓపై నిర్ణయం

ABN , First Publish Date - 2022-03-05T09:19:40+05:30 IST

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడుదుడుకులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ..

త్వరలో ఎల్‌ఐసీ ఐపీఓపై నిర్ణయం

దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే 

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడుదుడుకులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ మెగా ఐపీఓ ప్రారంభంపై పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 31) ఎల్‌ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దాంతో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభ సమయంపై ప్రభుత్వం పునరాలోచించవచ్చని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-05T09:19:40+05:30 IST