డిమార్ట్ షం‘షేర్’...

ABN , First Publish Date - 2022-01-03T21:11:04+05:30 IST

డిమార్ట్ షేర్లు ఇంట్రాడేలో ఇరగదీసాయి.

డిమార్ట్ షం‘షేర్’...

హైదరాబాద్ : డిమార్ట్ షేర్లు ఇంట్రాడేలో ఇరగదీసాయి. రూ. 4,799 కు చేరిన తర్వాత,  లాభాల స్వీకరణతో రూ. 4,719 కు దిగజారాయి.  గత ముగింపు ధర రూ. 4,671.45 తో పోల్చితే, ఈ రోజు ఈ షేరు రూ. 128 పెరిగింది. మూడో త్రైమాసికంలో... డిమార్ట్... స్టాండలోన్ రెవెన్యూ రూ. 9,065 కోట్లుగా పోస్ట్ చేయడమే ఈ బజ్ రావడానికి కారణమని భావిస్తున్నారు. నిరుడు  ఇదే కాలంతో పోల్చినప్పుడు 22 శాతం అధికం. దాంతో పాటే  డిమార్ట్ కంపెనీ గత ఐదేళ్లలో తొలిసారిగా ‘డెట్ ఫ్రీ’గా మారింది.  ప్రస్తుతం డిమార్ట్ (అవెన్యూ సూపర్ మార్ట్స్) షేరు ధర రూ. 47,120.05 వద్ద ట్రేడ్ అయింది. 

Read more