వినియోగదారుల ఎంపికలను మారుస్తున్న కంట్రీ డిలైట్!
ABN , First Publish Date - 2022-08-09T00:34:55+05:30 IST
డైరెక్ట్ టు హోమ్ కన్జుమర్ బ్రాండ్ కంట్రీ డిలైట్ వినియోగదారుల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి

హైదరాబాద్: డైరెక్ట్ టు హోమ్ కన్జుమర్ బ్రాండ్ కంట్రీ డిలైట్ వినియోగదారుల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. మధ్యవర్తులు లేకుండా పూర్తి సొంత సరఫరా చైన్ కలిగిన కంట్రీ డిలైట్ ఉత్పత్తులు ఇంట్లో తయారుచేసుకున్నట్టుగానే ఉంటాయి. కంట్రీ డిలైట్ ఇప్పుడు 15 నగరాలలో నెలకు 8 మిలియన్ డెలివరీలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో విస్తరించింది ఉంది.
భారతదేశపు తాజా ఆహారం, ప్రధానమైన ఆహార పదార్థాల మార్కెట్ 2025 నాటికి 50 బిలియన్ డాలర్లను అధిగమిస్తుందని అంచనా. నేడు దాదాపు 60 శాతానికి పైగా ఫ్రెష్ ఫుడ్ మార్కెట్ అసంఘటిత రంగంలో పరిమిత శీతల గిడ్డంగుల సదుపాయాలతో ఉంది. సరైన రవాణా సదుపాయాలు, తగినంత విజిబిలిటీ, సరఫరా చైన్ లేకుండా లభిస్తున్నాయి. కంట్రీ డిలైట్ తమ ‘నాణ్యత ముందు’ డీఎన్ఏ, సాంకేతికాధారిత సరఫరా చైన్ ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2012 తరువాత ఆహార పదార్థాల కల్తీ రెట్టింపు కావడంతో పాటు 28శాతానికి పైగా ఫుడ్ శాంపిల్స్ కల్తీ చేసినట్టు గుర్తించింది. ఈ కల్తీని నిరోధించేందుకు సాంకేతికాధారిత, వినియోగదారుల లక్ష్యిత విధానాన్ని కంట్రీడిలైట్ అనుసరిస్తోంది. భారతదేశంలో సుప్రసిద్ధ డైరెక్ట్ టు హోం ఫ్రెష్ ఫుడ్ ఎసెన్షియల్స్ బ్రాండ్‌గా ఇది నిలువడంతో పాటుగా పాలు, పండ్లు, కూరగాయలను వినియోగదారుల ఇంటి ముంగిటికి తీసుకొచ్చి అందిస్తోంది. ఈ కంపెనీ వ్యాపార నమూనా కారణంగా తాజా డెలివరీలను 24–36 గంటల లోపే పొందొచ్చు. కంట్రీ డిలైట్లలో అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను పొందొచ్చని సంస్థ కో ఫౌండర్ చక్రధర్ గాదె తెలిపారు.