44 వేల కియా కారెన్స్‌ రీకాల్‌

ABN , First Publish Date - 2022-10-05T09:37:10+05:30 IST

ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌లో లోపాల దిద్దుబాటుకు 44,174 కారెన్స్‌ కార్లు రీకాల్‌ చేస్తున్నట్టు కియా ఇండియా ప్రకటించింది.

44 వేల కియా కారెన్స్‌ రీకాల్‌

ఎయిర్‌బ్యాగ్‌లో లోపాల దిద్దుబాటు


న్యూఢిల్లీ: ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌లో లోపాల దిద్దుబాటుకు 44,174 కారెన్స్‌ కార్లు రీకాల్‌ చేస్తున్నట్టు కియా ఇండియా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ ను ఉచితంగానే అప్‌గ్రేడ్‌ చేస్తామని వెల్లడించింది. కార్ల యజమానులందరికీ ఈ మేరకు సందేశాలు పంపుతున్నట్టు తెలిపింది. లోపాలున్నట్టు గుర్తించిన కార్ల యజమానులు తమ సమీపంలోకి కియా అధీకృత డీలర్లను సంప్రదించి ఈ సదుపాయం పొందవచ్చునని పేర్కొంది. 

Read more