‘దక్ష’లో కోరమాండల్‌ పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-09-15T09:53:50+05:30 IST

దక్ష అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌లో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన డేర్‌ వెంచర్స్‌ పెట్టుబడులు పెట్టింది.

‘దక్ష’లో కోరమాండల్‌ పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  దక్ష అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌లో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన డేర్‌ వెంచర్స్‌ పెట్టుబడులు పెట్టింది. డేర్‌ వెంచర్స్‌ అందించిన నిధులను పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు దక్ష వినియోగిస్తుంది. వ్యవసాయం నుంచి రక్షణ వరకు వివిధ రంగాలకు సమగ్ర అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌ టెక్నాలజీ సొల్యూషన్లను దక్ష అందిస్తోందని డేర్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌, సమీర్‌ గోయెల్‌ తెలిపారు. వ్యవసాయ రంగం కోసం దక్ష ‘అగ్రిగేటర్‌’ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్‌లో 12 లీటర్ల స్ర్పే ట్యాంక్‌ వంటివి ఉంటాయి. రోజులో 8 గంటలు వినియోగించి 30-35 ఎకరాలను కవర్‌ చేయవచ్చని అన్నారు. 

Updated Date - 2022-09-15T09:53:50+05:30 IST