best 5g phones: 5జీ ఫోన్ కొనాలనుకుంటే వీటి గురించి తప్పక తెలుసుకోండి..

ABN , First Publish Date - 2022-09-15T23:22:19+05:30 IST

పండగ సీజన్ నేపథ్యంలో ఇండియాలో అతిత్వరలోనే ఫెస్టివల్ సేల్స్ ఆరంభమవబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్‌ను సెప్టెంబర్ 23 నుంచి షురూ చేయబోతున్నాయి.

best 5g phones: 5జీ ఫోన్ కొనాలనుకుంటే వీటి గురించి తప్పక తెలుసుకోండి..

పండగ సీజన్ నేపథ్యంలో ఇండియాలో అతిత్వరలోనే ఫెస్టివల్ సేల్స్ ఆరంభమవబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్‌ను సెప్టెంబర్ 23 నుంచి షురూ చేయబోతున్నాయి. పలు 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించబోతున్నాయనే అంచనాలున్నాయి. కాబట్టి రూ.25 వేల లోపు మంచి 5జీ ఫోన్ కొనాలనుకునేవారు పరిశీలించాల్సిన ఫోన్లు కొన్ని ఉన్నాయి. ఏయే కంపెనీల ఫోన్లు, అందిస్తున్న ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి. ఫోన్ కొనే సమయంలో ఈ డేటా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ

రూ.25 వేల ధరలోపు మార్కెట్‌లో లభ్యమవుతున్న బెస్ట్ ఫోన్ ఇది. ఈ ఫోన్‌కి  సొంతంగా ఫ్లుయిడ్ సాఫ్ట్‌వేర్ ఉంది. థర్డ్ పార్టీ యాప్స్ బెడద ఉండదు. ఉపయోగకరమైన ఫీచర్లు అందిస్తోంది. 6.43-ఇంచ్ అమోలెడ్ స్ర్కీన్‌ను 90హెచ్‌జెడ్ రిఫ్రెస్ రేటు‌తో అందిస్తోంది. బ్రైట్‌నెస్ విషయానికి వస్తే గరిష్ఠంగా 600 నిట్స్‌తో అందిస్తోంది. 4500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందిస్తోంది. 65వాట్స్ ఫాస్ట్ చార్జర్ అందిస్తుండగా.. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.23,900గా ఉంది.


రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ..

రూ.25 వేల లోపు లభ్యమవుతున్న 5జీ ఫోన్లలో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ ఒకటి. 6.67 అమోల్డ్ 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే‌ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్5తో అందిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 695 ఎస్‌వోసీ. కెమెరా పనితీరు బావుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. 67వాట్స్ ఫాస్ట్ ఛార్జర్.


మోటో ఎడ్జ్30 5జీ

థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా క్లీన్ ఇంటర్‌ఫేస్ కోరుకునేవారికి మోటో ఎడ్జ్30 చక్కటి ఎంపిక. 144 హెచ్‌జెడ్ డిస్‌ప్లే. క్వాల్‌కామ్ స్నాప్‌‌డ్రాగన్ 778జీ+ చిప్‌సెట్. 4020 ఎంఏహెచ్ బ్యాటరీతో లభ్యమవుతోంది. అయితే ఛార్జర్ మాత్రం 33 వాట్స్‌ మాత్రమే. కెమెరా పనితీరు బావుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో ఈ ఫోన్ ధర రూ.24,999గా ఉండే అవకాశం ఉంది. 


రియల్‌మీ 9 ప్రో+ 5జీ..

రూ.25 వేల ధరలోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లలో రియల్‌మీ 9 ప్రో+ 5జీ ఒకటి. 5జీ ఫోన్‌తో మంచి కెమెరా కోరుకునేవారికి ఇది చక్కటి ఆప్షన్. ట్రిపుల్ రియర్ కెమెరా(బ్యాక్) అందిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్‌వోసీతో పర్ఫార్మెన్స్ విషయంలో బావుంది. ఇక 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.4 అమోలెడ్ స్ర్కీన్‌‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌పై ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.22,999గా ఉంది.


సామ్‌సంగ్ గెలాక్సీ ఏ52 5జీ..

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ52 గతేడాదే భారత్‌లో విడుదలైంది. పాత స్మార్ట్‌ఫోనే అయినప్పటికీ సాధారణ యూజర్లకు నచ్చే అవకాశం లేకపోలేదు. ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.5 ఇంచ్ డిస్‌ప్లే‌తో లభ్యమవుతోంది. అమోలెడ్ స్ర్కీన్ కావడంతో బ్రైట్‌నెస్ ప్యానెల్, కలర్ కాంట్రాస్ట్ బావున్నాయి. బ్రైట్‌నెస్ గరిష్ఠంగా 800 నిట్స్‌గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 720జీ ఎస్‌వోసీతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌పై సామ్‌సంగ్ గెలాక్సీ ఏ52 5జీ ఫోన్ ధర రూ.22,999గా ఉంది.

Updated Date - 2022-09-15T23:22:19+05:30 IST