సోనీ, జీ విలీనానికి షరతులతో అనుమతి

ABN , First Publish Date - 2022-10-05T09:18:21+05:30 IST

మీడియా దిగ్గజాలు సోనీ, జీ విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ కొన్ని షరతులతో అనుమతి మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబరులో ఈ రెండు సంస్థలు విలీనాన్ని

సోనీ, జీ విలీనానికి షరతులతో అనుమతి

న్యూఢిల్లీ : మీడియా దిగ్గజాలు సోనీ, జీ విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ కొన్ని షరతులతో అనుమతి మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబరులో ఈ రెండు సంస్థలు విలీనాన్ని ప్రకటించాయి. కొన్ని మార్పులతో ఆ విలీనానికి తాము ఆమోదం తెలిపినట్టు సీసీఐ ఒక ట్వీట్‌లో తెలిపింది. టెలివిజన్‌ రంగంలో అవాంఛనీయ పోటీకి దారి తీస్తుందన్న కారణంతో ఆ కంపెనీలకు సీసీఐ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే వాటికి స్వచ్ఛందంగా కొన్ని నివారణలు చేసుకుంటామని ఉభయ సంస్థలు హామీ ఇవ్వడంతో వారి ప్రతిపాదనను సీసీఐ ఆమోదించిందని ఈ పరిణామంతో సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే వివరాలు వారు వెల్లడించలేదు.   

Read more