మరికొన్నేళ్లు పరిహారం ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2022-06-30T09:19:45+05:30 IST

జీఎ్‌సటీ అమలుతో ఏర్పడుతున్న ఆదాయ నష్టానికి గాను పరిహారం చెల్లింపులను మరికొనేళ్లు కొనసాగించాలని దాదాపు 12 రాష్ట్రాలు కోరాయి.

మరికొన్నేళ్లు పరిహారం ఇవ్వాల్సిందే

GST మండలిని కోరిన 12 రాష్ట్రాలు 

ఛండీగఢ్‌: జీఎ్‌సటీ అమలుతో ఏర్పడుతున్న ఆదాయ నష్టానికి గాను పరిహారం చెల్లింపులను మరికొనేళ్లు కొనసాగించాలని దాదాపు 12 రాష్ట్రాలు కోరాయి. కానీ, జీఎ్‌సటీ మండలి ఈ విషయంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆగస్టు తొలివారంలో జరగనున్న జీఎ్‌సటీ మండలి తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. గుర్రెపు పందేలు, క్యాసినోలు, లాటరీ, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధింపు ప్రతిపాదనపై నిర్ణయాన్ని జీఎ్‌సటీ మండలి వాయిదా వేసింది. సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు జరుపాల్సి ఉన్నందున ఆగస్టులో జరగనున్న  సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీతారామన్‌ వెల్లడించారు. ఈ అంశంపై నివేదికను జూలై 15కల్లా సమర్పించాలని మేఘాలయ సీఎం సంగ్మా అధ్యక్షత వహిస్తున్న మంత్రుల బృందాన్ని మండలి కోరింది. 


కొత్త పన్ను మార్పులివే.. 

జీఎస్‌టీ మండలి పలు పన్ను మార్పు నిర్ణయాలను ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులపై ప్రస్తుతం వర్తిస్తున్న మినహాయింపులను ఎత్తివేయగా.. మరికొన్నింటిపై మరింత పన్ను వడ్డించింది. ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏ, సెబీ అందించే సేవలనూ పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. కార్పొరేట్‌ కంపెనీలకు గృహ నివాసాల అద్దెపైనా జీఎస్‌టీ చెల్లించాల్సిందే. వచ్చేనెల 18 నుంచి కొత్త పన్నులు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆ వివరాలు.. 

5%: ప్రీ-ప్యాక్డ్‌ అండ్‌ లేబుల్డ్‌ ఉత్పత్తులకు సంబంధించి శీతలీకరించని మాంసం, చేపలు, పనీర్‌, లస్సీ, తేనె, ఎండబెట్టిన చిక్కుళ్లు, ఎండబెట్టిన మఖానా, గోధుమ ఇతర ధాన్యాలు, మరమరాలు(పేలాలు), ఐసీయూ మినహాయించి రూ.5,000కు పైగా రోజువారీ ఆస్పత్రి గది అద్దె, రోప్‌వే ద్వారా వస్తు, వ్యక్తుల రవాణా, ఆస్టమీ ఉపకరణాలు, బ్యాటరీ అమర్చిన లేదా లేని ఎలక్ట్రిక్‌ వాహనాలు 

12%: మ్యాప్‌లు, అట్లాస్‌ సహా చార్ట్‌లు, రోజుకు రూ.1,000 లోపు హోటల్‌ గది అద్దె, సోలార్‌ వాటర్‌ హీటర్‌, ట్రక్కులు మరియు వస్తు రవాణా వాహనాలపై ఇంధన చార్జీతో కూడిన అద్దె 

18%: టెట్రా ప్యాక్‌లు, చెక్‌ బుక్కు జారీకి వసూలు చేసే చార్జీ, ప్రింటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌, కటింగ్‌ బ్లేడ్స్‌తో కూడిన కత్తులు, పేపర్‌ కత్తులు, పెన్సిల్‌ షార్ప్‌నర్లు, ఎల్‌ఈడీ బల్బులు, డ్రాయింగ్‌ అండ్‌ మా ర్కింగ్‌ సాధనాలు, రోడ్లు, బ్రిడ్జీలు, రైల్వే, మెట్రో, ఎఫులెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌, శ్మశాన వాటికల కాంట్రాక్టులు

Updated Date - 2022-06-30T09:19:45+05:30 IST