Ranitidine: Rantac, Zinetac.. ఈ మందులు వాడుతుంటారా.. కేంద్రం పెద్ద ప్రకటనే చేసిందిగా..!

ABN , First Publish Date - 2022-09-13T23:55:56+05:30 IST

Ranitidine అనే మెడిసిన్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్సర్ వంటి గ్యాస్ట్రో సమస్యలతో ఇబ్బంది పడేవారితో పాటు గుండెల్లో మంట వంటి సమస్యలు..

Ranitidine: Rantac, Zinetac.. ఈ మందులు వాడుతుంటారా.. కేంద్రం పెద్ద ప్రకటనే చేసిందిగా..!

Ranitidine అనే మెడిసిన్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్సర్ వంటి గ్యాస్ట్రో సమస్యలతో ఇబ్బంది పడేవారితో పాటు గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు ఈ మెడిసిన్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అయితే.. Ranitidine మెడిసిన్ కలిగిన బ్రాండ్స్ అయిన Rantac, Zinetac, Aciloc మందుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా తేలడంతో అత్యవసర మందుల జాబితాలో నుంచి వీటిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తొలగించింది. 384 మెడిసిన్స్‌తో కూడిన National List of Essential Medicines (NLEM) కొత్త జాబితాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ జాబితా నుంచి 26 మెడిసిన్స్‌ను తొలగించింది. అంటే.. దీనర్థం ఇకపై ఈ 26 రకాల మందులు దేశంలో అందుబాటులో ఉండవు. కేంద్ర ప్రభుత్వం అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించిన ఆ మెడిసిన్స్ జాబితా ఇదే..



1. Atenolol

2. Alteplase

3. Bleaching Powder

4. Capreomycin

5. Chlorpheniramine

6. Cetrimide

7. Dimercaprol

8. Diloxanide furoate

9. Erythromycin

10. Ethinylestradiol

11. Ethinylestradiol(A) Norethisterone (B)

12. Ganciclovir

13. Kanamycin

14. Lamivudine (A) + Nevirapine (B) + Stavudine (C)

15. Leflunomide

16. Methyldopa

17. Nicotinamide

18. Pegylated interferon alfa 2a, Pegylated interferon alfa 2b

19. Pentamidine

20. Prilocaine (A) + Lignocaine (B)

21. Procarbazine

22. Ranitidine

23. Rifabutin

24. Stavudine (A) + Lamivudine (B) 25. Sucralfate

26. White Petrolatum


ఇదిలా ఉండగా.. Ranitidine మెడిసిన్‌పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకుంది. Ranitidine మెడిసిన్‌లో క్యాన్సర్ కారకమైన N-nitrosodimethylamine (NDMA) ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అమెరికాకు చెందిన Food and Drug Administration పరిశోధనల్లో వెల్లడైంది. ఇదిలా ఉండగా.. Zantac ప్రపంచంలోనే విరివిగా వినియోగంలో ఉండే మందు. ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించడంతో భారత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండే కొన్ని మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

Updated Date - 2022-09-13T23:55:56+05:30 IST