27న కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాలు
ABN , First Publish Date - 2022-01-19T05:51:55+05:30 IST
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ఈ నెల 27న ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ఈ నెల 27న ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. బెంగళూరులోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరగనున్న బోర్డు సమావేశంలో ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సూచనల మేరకు కొవిడ్ నియమాలను పాటిస్తూ వర్చువల్గా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నారు.