MoneyMakingApps: ఈ 8 యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? అయితే ఈజీగా డబ్బు సంపాదించొచ్చు..
ABN , First Publish Date - 2022-10-17T22:39:31+05:30 IST
మీరు స్మార్ట్‌ఫోన్ (SmartPhone) యూజరా?.. ఫ్రీ టైమ్‌లో (Free time) డబ్బు సంపాదించాలనుకుంటున్నారా ?.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెప్పాలి.
మీరు స్మార్ట్‌ఫోన్ (SmartPhone) యూజరా?.. ఫ్రీ టైమ్‌లో (Free time) డబ్బు సంపాదించాలనుకుంటున్నారా ?.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఖాళ్లీ సమయాల్లో డబ్బు సంపాదించే యాప్స్‌ను (money making apps) ఉపయోగించి ఎంతోకొంత ఆదాయాన్ని పొందొచ్చు. ఈ యాప్స్‌ను ఉపయోగించడం చాలా సులభం. వీటిని మీ స్మార్ట్‌ఫోన్లలో వాడొచ్చు. ఈ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ (Google play store) నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఐవోఎస్ వినియోగదారులైతే యాప్ స్టోర్ (app store) నుంచి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటి వినియోగానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఆ యాప్స్ ఏమిటి?.. వాటి ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో మీరూ ఓ లుక్కేయండి...
భారత్‌లో బెస్ట్ మనీ మేకింగ్ యాప్స్ ఇవే..
డ్రీమ్ 11 ..
ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’ (Dream 11) యాప్‌పై బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ వంటి వేర్వురు గేమ్స్‌ను ఆఫర్ చేస్తుంది. యూజర్లు తమకు అవగాహన ఉన్న గేమ్, ఆటగాళ్లు గురించి తెలిసిన గేమ్‌ను ఎంచుకోవాలి. క్రికెట్ ఆటగాళ్ల గురించి తెలిసినవాళ్లు ఫంటసీ క్రికెట్ గేమ్ ఎంచుకోవడం బెస్ట్. ఒక మ్యాచ్‌లో బాగా ఆడతారని నమ్మకమున్న ఫాంటసీ ప్లేయర్లతో ఒక టీమ్‌గా ఎంచుకోవాలి. ఎంచుకున్న ఆటగాళ్లు మ్యాచ్‌లో ఎంతబాగా రాణిస్తారనే దానిబట్టి యూజర్లకు అవార్డెడ్ పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ అనంతరం పాయింట్లను లెక్కిస్తారు. పాయింట్లను బట్టి విజేతలను నిర్ణయిస్తారు. విజేతలకు నేరుగా అకౌంట్‌లోనే డబ్బు జమవుతుంది.
క్యాష్‌బడ్డీ
ఈ యాప్‌ను ఉపయోగించి వేర్వేరు మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు. రెఫరల్ చేయడం లేదా యూట్యూబ్‌లో వీడియోలు చూడడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు. మీరు సంపాదించే ప్రతి రూపాయీ మీ పేటీఎం (PayTM) వాలెట్‌లో క్రెడిట్ అవుతుంది.
మీషో..
ఇండియాలో డబ్బు సంపాదించిపెట్టే బెస్ట్ యాప్స్‌లో మీషో (Meesho) యాప్ ఒకటి. ఈ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో వస్తువులను అమ్మవచ్చు. ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని ఎంపిక చేసుకుని అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవచ్చు. అమ్మకానికి సంబంధించిన లాభంలో యూజర్ వాటా అతడి ఖాతాలో జమవుతుంది.
మూక్యాష్
మూక్యాష్ (MooCash) యాప్‌ని రోజుకు 5 డాలర్ల వరకు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించేందుకు వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం, సర్వేలు పూర్తి చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. తద్వారా క్యాష్ లేదా రీఛార్జ్ వోచర్స్ రూపంలో మీరు డబ్బు పొందొచ్చు. అంతేకాదు క్రిప్టో కరెన్సీలను కూడా సంపాదించవచ్చు.
గూగుల్‌పే..
భారత్‌లో బెస్ట్ మనీ మేకింగ్ యాప్స్‌లో గూగుల్‌పే (GooglePay) యాప్ ఒకటి. రివార్డ్ సెక్షన్ ద్వారా కూపన్స్ పొంది డబ్బు ఆర్జించవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు అందరికీ ఈ యాప్ అందుబాటులో ఉంది. డబ్బు సంపాదించడమే కాకుండా ఈ యాప్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా రివార్డ్స్ పొందొచ్చు.
మొబైల్ ప్రీమియర్ లీగ్..
నైపుణ్యమున్న ఆటగాళ్లైతే ఈ-స్టోర్ట్స్ ప్లాట్‌ఫామ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (Mobile premier League)పై మొబైల్ గేమ్స్‌లో పోటీపడొచ్చు. గెలుపొంది డబ్బు సంపాదించవచ్చు. 1:1 గేమ్స్‌తోపాటు డ్రీమ్ 11 మాదిరిగా ఫాంటసీ స్పోర్ట్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
రోజ్‌ధన్
రోజ్‌ధన్ (RozDhan) యాప్ ద్వారా రోజువారీ ఆదాయాన్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇండియాలో బెస్ట్ మనీ మేకింగ్ యాప్స్‌లో ఇదొకటి. ఈ యాప్‌ని ఉపయోగించి వేర్వేరు మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు. వార్తలు చదవడం, సర్వేలు చేయడం లేదా గేమ్స్ ఆడడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. పేటీఎం వాలెట్‌లో మీ డబ్బు క్రెడిట్ అవుతుంది. దానిని విత్‌డ్రా చేసుకోవచ్చు.
వోంక్..
నైపుణ్యాలతో డబ్బు సంపాదించగలిగే యాప్స్‌లో వోంక్ (Wonk) యాప్ ఒకటి. ఒకవేళ మీకు చదువు చెప్పడం ఇష్టమైతే ఆన్‌లైన్ ట్యూటర్‌గా పనిచేసి డబ్బు సంపాదించవచ్చు. మీరు వెచ్చించే సమయాన్ని బట్టి రూ.250 నుంచి రూ.1000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.