‘బిగ్ సి’ వార్షికోత్సవ ఆఫర్లు
ABN , First Publish Date - 2022-12-08T04:31:32+05:30 IST
మొబైల్ రిటైల్ చెయిన్‌లో అగ్రగామి బిగ్ సి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లక్కీడ్రా తో పాటు కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది...
హైదరాబాద్: మొబైల్ రిటైల్ చెయిన్‌లో అగ్రగామి బిగ్ సి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లక్కీడ్రా తో పాటు కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది. కంపె నీ సీఎండీ బాలు చౌదరి ఈ విషయం ప్రకటిస్తూ డిసెంబరు 3వ తేదీ నుంచి 2023 జనవరి 29వ తేదీ మధ్యలో తమ స్టోర్లలో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన కస్టమర్లకు లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలిపారు. డ్రాలో గెలుపొందిన వారికి 20 కార్లు, 20 బైక్‌లు, 20 ఏసీలు, 20 ఫ్రిజ్ లు, 20 టీవీలు బహుమతిగా ఇస్తున్నామన్నారు. ప్రతీ స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుందని చెప్పారు. అలాగే యాక్సెసరీస్ కొనుగోలుపై కూడా రిటైల్ చరిత్రలోనే తొలిసారిగా కచ్చితమైన బహుమతి అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతే కాదు ఏటీఎం కార్డు ను ఉపయోగించి ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా మొబై ల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇవి కాకుండా వివిధ బ్రాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై డిస్కౌంట్, కాష్‌బాక్ కూడా అందిస్తున్నట్టు తెలిపారు.