బీన్యూ మొబైల్స్‌ దసరా, దీపావళి ఆఫర్లు

ABN , First Publish Date - 2022-10-05T09:39:02+05:30 IST

: మొబైల్స్‌తోపాటు గృహోపకరణాలపై కూడా దసరా, దీపావళి పండగల ఆఫర్లను ప్రకటించినట్లు బీన్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ తెలిపింది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 40 శాతం (రూ.20 వేల వరకూ) తగ్గింపు

బీన్యూ మొబైల్స్‌ దసరా, దీపావళి ఆఫర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మొబైల్స్‌తోపాటు గృహోపకరణాలపై కూడా దసరా, దీపావళి పండగల ఆఫర్లను ప్రకటించినట్లు బీన్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ తెలిపింది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 40 శాతం (రూ.20 వేల వరకూ) తగ్గింపు ఇస్తున్నట్లు బీన్యూ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) వైడీ బాలాజీ చౌదరి తెలిపారు. యాక్సెసరీలపై 60 శాతం, టీవీలపై రూ.15,000 వరకూ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నామని సీఈఓ సాయి నిఖిలేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి నితేశ్‌ చెప్పారు. ఎంపిక చేసిన ప్రతి మొబైల్‌పై స్మార్ట్‌ వాచ్‌, స్మార్ట్‌ బడ్స్‌, స్మార్ట్‌ సౌండ్‌బార్స్‌, నెక్‌ బ్యాండ్‌లను తక్కువ ధరలకే అందిసు ్తన్నామని నిశిలేశ్‌ తెలిపారు. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై 7.5 శాతం, మొబిక్విక్‌ ద్వారా చేసే కొనుగోలుపై 5 శాతం ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నట్లు బీన్యూ ఒక ప్రకటనలో తెలిపింది.


ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌ ఆధారంగా మొబైల్‌, టీవీ, ల్యాప్‌ టాప్‌లు కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులకు రుణం అందించే సదుపాయాన్ని కల్పిస్తోంది. వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేకుండా కొనుగోళ్లకు రుణం ఇచ్చే వెసులుబాటు ఉందని బీన్యూ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని 150కి పైగా బీన్యూ స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సాయి నితేశ్‌ చెప్పారు. 

Read more