రిటైల్ సెగ్మెంట్లో... బజార్ ఇండియా ఊపు... మరింత విస్తరణ దిశగా యత్నాలు...
ABN , First Publish Date - 2022-01-29T00:34:03+05:30 IST
బజార్ ఇండియా... విభిన్న శేణుల్లో దుస్తులు, గృహోపకణాలను రిటైల్ చైన్ ద్వారా అందిస్తోంది. అవి సమంజసమైన ధరకేగాక, లేటెస్ట్ ఫ్యాషన్ అనుభవాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయన్న పేరుంది.
హైదరాబాద్ : బజార్ ఇండియా... విభిన్న శేణుల్లో దుస్తులు, గృహోపకణాలను రిటైల్ చైన్ ద్వారా అందిస్తోంది. అవి సమంజసమైన ధరకేగాక, లేటెస్ట్ ఫ్యాషన్ అనుభవాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయన్న పేరుంది. ఇప్పటివరకు సేవలు అందని ప్రాంతాలకు విస్తరించి, నగరాల తరహా అనుభవాన్ని ‘అండర్-సర్వీస్డ్‘ వినియోదారులకు అందించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
బజార్ ఇండియా ఓ ‘వన్ స్టాప్ షాప్’ అన్న విషయం తెలిసిందే. ‘ఫ్యాషన్ కే సాథ్ బచత్ భీ’ అన్నది కంపెనీ నినాదం. దీనికి తగ్గట్లే, కుటుంబం మొత్తం ఫ్యాషన్ అవసరాలను అత్యంత తక్కువ ధరల్లో అందిస్తోంది.టైర్-2, టైర్-3 నగరాల్లోని దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలు కంపెనీ ప్రధాన క్లయింట్లు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోకీ విస్తరించి, ఉనికిని చాటుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.