అపోలో చేతికి ‘ఆయుర్వేద్’ హాస్పిటల్ !
ABN , First Publish Date - 2022-08-04T07:54:19+05:30 IST
దేశంలో అతి పెద్ద హాస్పిటల్ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఆయుర్వేద విభాగంలోకి ప్రవేశిస్తోంది...
హైదరాబాద్: దేశంలో అతి పెద్ద హాస్పిటల్ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఆయుర్వేద విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ఆయుర్వేద్’ హాస్పిటల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ చర్చలు త్వరలోనే తుది దశకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే రెండు కంపెనీలు దీనిపై నోరు మెదపడం లేదు.