వినియోగదారుకు మరో సి‘మంట’

ABN , First Publish Date - 2022-12-07T02:22:01+05:30 IST

సిమెంట్‌ ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో కంపెనీలు బస్తా సిమెంట్‌ ధర రూ.10 నుంచి రూ.15 వరకు పెంచే అవకాశం ఉందని...

వినియోగదారుకు మరో సి‘మంట’

  • బస్తాపై రూ.15 వరకు భారం

  • ఎమ్కే గ్లోబల్‌

న్యూఢిల్లీ : సిమెంట్‌ ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో కంపెనీలు బస్తా సిమెంట్‌ ధర రూ.10 నుంచి రూ.15 వరకు పెంచే అవకాశం ఉందని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈజీఎఫ్‌ఎస్‌ఎల్‌) ఒక నివేదికలో తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరిగాయనే పేరుతో ఈ ఏడాది ఆగస్టు నుంచి కంపెనీలు ఇప్పటికే బస్తా సిమెంట్‌ ధర రూ.16 వరకు పెంచాయి. ఇందులో రూ.6 నుంచి రూ.7 గత నెల పెంచాయి.

దక్షిణాదిలోనే డిమాండ్‌: ప్రస్తుతం దేశ పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సిమెంట్‌ డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉంది. ఉత్తర, తూర్పు, దక్షిణాది మార్కెట్లలో మాత్రం జోరందుకుంది. బ్రాండ్‌ను బట్టి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్‌ బస్తా రూ.370 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. వచ్చే కొద్ది రోజుల్లో ఇది మరో రూ.15 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. వినియోగదారులకు భారమైనా, డిమాండ్‌ ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణి కంపెనీల్లో కనిపిస్తోంది. దీంతో నిర్మాణ వ్యయం మరింత కొండెక్కే ప్రమాదం ఉందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T02:22:09+05:30 IST