అమరరాజా బ్యాటరీస్‌ ఆదాయం రూ.2,620 కోట్లు

ABN , First Publish Date - 2022-08-07T07:32:29+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.132 కోట్ల నికర లాభాన్ని

అమరరాజా బ్యాటరీస్‌ ఆదాయం రూ.2,620 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.132 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.124 కోట్లతో పోలిస్తే స్వల్పంగా ఆరు శాతమే పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం రూ.1,886 కోట్ల నుంచి రూ.2,620 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.


జూన్‌తో ముగిసిన మూడు నెలలకు ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ (ఈపీఎస్‌) రూ.7.7 ఉంది. ఆటోమోటివ్‌ బ్యాటరీల విభాగంలో ఆఫ్టర్‌ మార్కెట్‌ విభాగంలో గిరాకీ బాగుంది. నాలుగు, ద్విచక్ర వాహన కంపెనీల నుంచి కూడా డిమాండ్‌ ఆశావహంగా ఉందని అమరరాజా బ్యాటరీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ గల్లా తెలిపారు. ఇంధనం, ఇతర ముడి పదార్థాల ధరల పెరుగుదల ఆటోమోటివ్‌, ఇండస్ట్రియల్‌ బ్యాటరీస్‌ విభాగంలో మార్జిన్లపై ఒత్తిడి పెంచాయని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హర్షవర్థన గౌరినేని తెలిపారు.

Updated Date - 2022-08-07T07:32:29+05:30 IST