అలియా భట్‌‌తో ప్రచారాన్ని ప్రారంభించిన మెక్కెఫిన్

ABN , First Publish Date - 2022-07-01T01:54:15+05:30 IST

భారతదేశపు మొట్టమొదటి కెఫిన్ కలిగిన వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన మెక్కెఫిన్ అంబాసిడర్, బాలీవుడ్

అలియా భట్‌‌తో ప్రచారాన్ని ప్రారంభించిన మెక్కెఫిన్

న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి కెఫిన్ కలిగిన వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన మెక్కెఫిన్ అంబాసిడర్, బాలీవుడ్ నటి అలియాభట్.. కాఫీ బాడీ స్క్రబ్, కాఫీ బాడీ వాష్‌ల ప్రచారాన్ని ప్రారంభించింది. ‘మీరు తీసుకునే ప్రతి షవర్ ఇప్పుడు ఒక కాఫీ డేట్’ అంటూ వినూత్న ప్రచారం ప్రారంభించింది. ప్రతి ఒక్కరూ షవర్‌లో కాఫీ రుచిని ఆస్వాదించాలని కోరుతున్న 45 సెకన్ల నిడివి ఉన్న యాడ్‌ఫిల్మ్‌ విడుదలైంది. ఈ సరికొత్త ప్రచారంపై మెక్‌కెఫిన్ కో-ఫౌండర్, మార్కెటింగ్ హెడ్ వైశాలి గుప్తా మాట్లాడుతూ..  అలియా భట్‌తో తమ కొత్త ప్రచారాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  మిలీనియల్ ఫోకస్డ్, పర్సనల్ కేర్ బ్రాండ్ కావడం వల్ల నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఎక్కువ మొగ్గు చూపే ప్రచారంతో తమ బెస్ట్ సెల్లర్ ఉత్పత్తులను హైలైట్ చేస్తామని చెప్పుకొచ్చారు.  


ప్రచారకర్త అలియా భట్ మాట్లాడుతూ.. ఈ అసోసియేషన్ కాఫీ పట్ల తనకున్న ప్రేమ, ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను మిళితం చేస్తుందన్నారు.  మెక్కెఫిన్ ఉత్పత్తులను ‘పెటా‘ శాకాహారంగా ధ్రువీకరించిందన్నారు. మీరు తీసుకునే ప్రతి షవర్ ఇప్పుడు కాఫీ డేట్ అవుతుందిని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-01T01:54:15+05:30 IST