ఒకే ఒక్కడు ఆకాశ్‌

ABN , First Publish Date - 2022-09-29T09:29:46+05:30 IST

ప్రపంచంలోని 100 మంది వర్ధమాన నాయకులకు సంబంధించి ప్రముఖ టైమ్స్‌ మ్యాగజైన్‌ బుధవారం విడుదల చేసిన జాబితాలో ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి చోటు దక్కింది.

ఒకే  ఒక్కడు ఆకాశ్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోని 100 మంది వర్ధమాన నాయకులకు సంబంధించి ప్రముఖ టైమ్స్‌ మ్యాగజైన్‌ బుధవారం విడుదల చేసిన జాబితాలో ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి చోటు దక్కింది. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఆకాశ్‌ అంబానీయే కావడం గమనార్హం. దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోకు చైర్మన్‌గా 30 ఏళ్ల ఆకాశ్‌ ఈ ఏడాది జూన్‌లో పగ్గాలు చేపట్టారు. 22 ఏళ్ల వయసులోనే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. కంపెనీలోకి గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వేల కోట్ల పెట్టుబడులను రాబట్టడంలో ఆకాశ్‌ కీలక పాత్ర పోషించారని టైమ్స్‌ మాగ్యజైన్‌ పేర్కొంది. 

Read more