ఇంటర్నేషనల్‌ రోమింగ్‌కు ఎయిర్‌టెల్‌ వరల్డ్‌ పాస్‌

ABN , First Publish Date - 2022-12-07T02:10:57+05:30 IST

విదేశీ ప్రయాణికులపైనా ఎయిర్‌టెల్‌ దృష్టి పెట్టింది. వీరి కోసం ప్రస్తుతం ఉన్న వివిధ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాక్‌లకు...

ఇంటర్నేషనల్‌ రోమింగ్‌కు ఎయిర్‌టెల్‌ వరల్డ్‌ పాస్‌

న్యూఢిల్లీ: విదేశీ ప్రయాణికులపైనా ఎయిర్‌టెల్‌ దృష్టి పెట్టింది. వీరి కోసం ప్రస్తుతం ఉన్న వివిధ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాక్‌లకు ఎయిర్‌టెల్‌ గుడ్‌బై చెప్పి, వాటి స్థానంలో ‘వరల్డ్‌ పాస్‌’ పేరుతో ప్రత్యేక పథకం తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌ కింద 184 దేశాలు కవరవుతాయి. విదేశీ ప్రయాణికులు ఈ జాబితాలోని దేశాలకు చేసే కాల్స్‌ డేటా చార్జీలూ 99 శాతం వరకు తగ్గుతాయని తెలిపింది. పోస్టుపెయిడ్‌ ఖాతాదారులు అందరూ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఈ కొత్త పథకానికి మారవచ్చు. ఒక రోజు నుంచి 365 రోజులు చెల్లుబాటయ్యే ఎయిర్‌టెల్‌ వరల్డ్‌ పాస్‌ పథకం టారిఫ్‌ రూ.649 నుంచి రూ.2,997 వరకు ఉంటుంది.

Updated Date - 2022-12-07T02:11:01+05:30 IST