ఎయిర్‌టెల్‌ లాభం ఐదింతలు

ABN , First Publish Date - 2022-08-09T05:46:57+05:30 IST

జూన్‌ 30వ తేదీతో ముగిసిన తొలి త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.32,805 కోట్ల ఆదాయంపై రూ.1,607 కోట్ల నికర లాభం

ఎయిర్‌టెల్‌ లాభం ఐదింతలు

క్యూ1లో రూ.1,607 కోట్లు


న్యూఢిల్లీ: జూన్‌ 30వ తేదీతో ముగిసిన తొలి  త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.32,805 కోట్ల ఆదాయంపై రూ.1,607 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 22 శాతం, నికర లాభం 467 శాతం పెరిగాయి. రిలయన్స్‌ జియోతో గట్టి పోటీ ఉన్నా జూన్‌ త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ కొత్తగా 45 లక్షల మంది ఖాతాదారులను సంపాదించింది. దీంతో మొత్తం ఖాతాదారుల సంఖ్య 36.2 కోట్లకు చేరింది. ఒక్కో కస్టమర్‌ నుంచి లభించే సగటు ఆదాయం రూ.183కు చేరింది. 

Updated Date - 2022-08-09T05:46:57+05:30 IST