దుమ్మురేపిన AIA Engineering షేర్లు.. 52 వారాల గరిష్టానికి స్టాక్
ABN , First Publish Date - 2022-08-10T20:28:52+05:30 IST
ఏఐఏ ఇంజినీరింగ్(AIA Engineering) షేర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల తర్వాత దుమ్మురేపుతున్నాయి.

AIA Engineering Shares : ఏఐఏ ఇంజినీరింగ్(AIA Engineering) షేర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల తర్వాత దుమ్మురేపుతున్నాయి. బుధవారం ఏఐఏ ఇంజినీరింగ్ షేర్లు 10 శాతం ఎగిసి 52 వారాల గరిష్టం రూ. 2,644కి చేరుకుంది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 28.4 శాతం పెరిగి రూ.191.47 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.149.10 కోట్లుగా ఉంది.
మొత్తం ఆదాయం సంవత్సరానికి 41.2 శాతం పెరిగి రూ.1,100.33 కోట్లకు చేరుకుంది. గత ఎనిమిది వారాల్లో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 14.5 శాతం ర్యాలీ నుంచి స్టాక్ దాదాపు 27 శాతం ర్యాలీ చేసింది. స్టాక్ మార్చి 2022 ప్రారంభంలో కనిష్ట స్థాయి నుంచి దాదాపు 79 శాతం జూమ్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.300 కోట్ల కాపెక్స్‌ను అంచనా వేసింది. ఇందులో మిల్ లైనింగ్ ప్రాజెక్ట్(, గ్రైండింగ్ మీడియా ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ విండ్, సోలార్ పవర్ ఉన్నాయి. జూలై 01, 2022 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ రూ.700 కోట్లుగా ఉంది.