ఎన్‌డీటీవీపై అదానీకి పూర్తి పట్టు

ABN , First Publish Date - 2022-12-31T03:19:31+05:30 IST

ఎన్‌డీటీవీలో ప్రధాన ప్రమోటర్లు ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌ల శకం ముగిసింది.

ఎన్‌డీటీవీపై అదానీకి పూర్తి పట్టు

మెజారిటీ వాటా హస్తగతం

న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీలో ప్రధాన ప్రమోటర్లు ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌ల శకం ముగిసింది. ఎన్‌డీటీవీ ఈక్విటీలో వారిరువురికి ఉన్న 32.26 శాతం వాటాలో 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. దీంతో ఎన్‌డీటీవీ ఈక్విటీలో అదానీల వాటా 64.7 శాతానికి చేరింది. రాయ్‌ దంపతుల నుంచి ఈ 27.26 శాతం షేర్ల కోసం అదానీ గ్రూప్‌ ఒక్కో షేరుకు రూ.342.65 చొప్పున చెల్లించింది. ఓపెన్‌ ఆఫర్‌లో సాధారణ వాటాదారులకు చెల్లించిన ధర కంటే ఇది 17 శాతం ఎక్కువ. దీంతో సెబీ దీనికి అడ్డు చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2022-12-31T03:19:32+05:30 IST