కాపర్‌ వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌

ABN , First Publish Date - 2022-06-27T09:30:46+05:30 IST

అదానీ గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది.

కాపర్‌ వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌

బ్యాంకుల నుంచి రూ.6,071 కోట్ల రుణం

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. గుజరాత్‌లోని ముంద్రా వద్ద ఏటా 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కాపర్‌ (రాగి) ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌.. కచ్‌ కాపర్‌ లిమిటెడ్‌ (కేసీఎల్‌) పేరుతో ప్రత్యేక అను బంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ తొలి దశకు రూ.6,070 కోట్ల రుణ సాయం చేసేందుకు ఎస్‌బీఐ నాయకత్వంలో ఏడు బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐదు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే తొలిదశ 2024వ సంవత్సరం ప్రథమార్థంలో పూర్తవుతుందని సమాచారం. నిధుల సమీకరణ ప్రణాళిక పూర్తవడంతో ముంద్రాలో ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులు ఇప్పటికే ఊపందుకున్నాయి. 

Updated Date - 2022-06-27T09:30:46+05:30 IST