9 వేల మారుతి కార్ల రీకాల్‌

ABN , First Publish Date - 2022-12-07T02:07:40+05:30 IST

ముందువరుస సీటు బెల్టుల్లో ఉన్న లోపాన్ని సరిదిద్దేందుకు మారుతి సుజుకీ 9125 కార్లను రీకాల్‌ చేస్తోంది...

9 వేల మారుతి కార్ల రీకాల్‌

న్యూఢిల్లీ : ముందువరుస సీటు బెల్టుల్లో ఉన్న లోపాన్ని సరిదిద్దేందుకు మారుతి సుజుకీ 9125 కార్లను రీకాల్‌ చేస్తోంది. వాటిలో సియాజ్‌, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6, గ్రాండ్‌ విటారా ఉన్నాయి. ఈ ఏడాది నవంబరు 2 నుంచి 28 తేదీల మధ్యలో ఉత్పత్తి అయిన కార్లలో ఈ లోపాన్ని గుర్తించినట్టు కంపెనీ నియంత్రణ సంస్థలకు పంపిన ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-12-07T02:07:43+05:30 IST