యూనియన్‌ బ్యాంక్‌కు 6 ఐబీఏ టెక్నాలజీ అవార్డులు

ABN , First Publish Date - 2022-12-07T02:09:17+05:30 IST

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022 ఏడాదికి ఆరు ఐబీఏ బ్యాంకింగ్‌ టెక్నాలజీ అవార్డులు దక్కించుకుంది...

యూనియన్‌ బ్యాంక్‌కు 6 ఐబీఏ టెక్నాలజీ అవార్డులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతిబిజినెస్‌): యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022 ఏడాదికి ఆరు ఐబీఏ బ్యాంకింగ్‌ టెక్నాలజీ అవార్డులు దక్కించుకుంది. పెద్ద బ్యాంకుల విభాగంలో ఈ అవార్డులు లభించినట్లు బ్యాంకు తెలిపింది. బెస్ట్‌ టెక్నాలజీ బ్యాంక్‌, బెస్ట్‌ ఐటీ రిస్క్‌ మేనేజిమెంట్‌, బెస్ట్‌ టెక్నాలజీ టాలెంట్‌ విభాగాల్లో విన్నర్‌గా నిలిచింది. బెస్ట్‌ ఏఐ అండ్‌ ఎంఎల్‌ బ్యాంక్‌, బెస్ట్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూషన్‌, బెస్ట్‌ ఫిన్‌టెక్‌ కొలాబరేషన్‌ విభాగాల్లో రన్నర్‌గా అవార్డులు సాధించినట్లు బ్యాంకు వెల్లడించింది. ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం, ఇన్నోవేషన్‌ సొల్యూషన్లను ప్రవేశపెట్టడం ద్వారా కార్యకలా పాలను డిజిటిలీకరణ చేసే ప్రక్రియలో యూనియన్‌ బ్యాంకు ఉంది.

Updated Date - 2022-12-07T02:09:20+05:30 IST