5G in India: 5జీ వచ్చేసింది.. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది..!

ABN , First Publish Date - 2022-10-01T22:19:25+05:30 IST

దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ సేవలు (5g in india) శనివారం (అక్టోబరు 1) నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి..

5G in India: 5జీ వచ్చేసింది.. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది..!

దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ సేవలు (5g in india) శనివారం (అక్టోబరు 1) నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ‘ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌’ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను (5g launch in india) ప్రారంభించారు. 5జీ సేవల (5g) విషయానికి వస్తే.. తొలి దశలో ప్రధాన నగరాలతో ప్రారంభించి, వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఇదిలా ఉంటే.. 5జీ సేవలు (5g launch) అందుబాటులోకి వస్తున్నప్పటికీ వినియోగదారుల్లో ఇప్పటికీ చాలా సందేహాలు అలానే ఉండిపోయాయి. 5జీ ప్లాన్ల ధరలు (5g services in india) ఎంత ఉండబోతున్నాయి? 5జీ సేవలు (5g mobile) పొందాలంటే కొత్త సిమ్ (5g sim) తీసుకోవాలా లేక ప్రస్తుతం వినియోగిస్తున్న సిమ్‌తోనే 5జీ సేవలను (5g plans jio) పొందొచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాల నడుమ 5జీ సేవలు (5g network in india) 8 నగరాల్లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌టెల్ శనివారం నుంచే 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. జియో కూడా త్వరలో 5జీ ప్లాన్ల వివరాలను అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికైతే వొడాఫోన్ ఐడియా వొడాఫోన్ ఎలాంటి 5జీ ప్లాన్లను (5g plans) ప్రకటించలేదు.రిలయన్స్ జియో (Jio 5g)

4జీ సేవలను అతి చౌక ధరకు అందుబాటులోకి తీసుకొచ్చిన రిలయన్స్ జియో (Reliance Jio) 5జీ మార్కెట్‌లో (Jio 5g) కూడా తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకుంది. భారత్‌లో దీపావళి (Diwali) నాటికి 5జీ ప్లాన్లను ప్రకటించాలని జియో భావిస్తోంది. అక్టోబర్ 22-26 మధ్య జియో 5జీ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాలుగు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ఇతర నగరాల్లో కూడా 5జీ సేవలను రిలయన్స్ జియో విస్తరించనుంది.


ఎయిర్‌టెల్ (Bharti Airtel)

5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో ఎయిర్‌టెల్ (Airtel 5G).. జియో (Jio) కంటే ముందుండటం విశేషం. దేశంలోని నాలుగు మెట్రో నగరాలతో పాటు మరో నాలుగు నగరాల్లో కూడా.. అంటే మొత్తం ఎనిమిది నగరాల్లో శనివారం (01-10-2022) నుంచే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎయిర్‌టెల్ (Airtel) ప్రకటించింది. అయితే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా నగరాలతో పాటు మిగిలిన నాలుగు నగరాలు ఏంటనే విషయంలో మాత్రం ఎయిర్‌టెల్ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. మార్చి, 2024 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రకటించారు.


వొడాఫోన్ ఐడియా (Vodafone Idea)

5జీ సేవల కోసం వొడాఫోన్ ఐడియా కస్టమర్లు మరి కొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు. 5జీకి సంబంధించిన ఎలాంటి ప్రకటన వొడాఫోన్ ఐడియా యాజమాన్యం చేయకపోవడం గమనార్హం. అయితే.. 5జీ సేవలపై వొడాఫోన్ ఐడియా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రకటన ఎప్పుడు ఉండనుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.ఏమిటీ 5జీ?

ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు (4G Services) అనేక రెట్ల వేగంతో 5జీ నెట్‌వర్క్‌లు (5G Networks) పనిచేస్తాయి. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాల్లో అత్యంత ప్రధానమైనది.. లాటెన్సీ (Latency). అంటే.. స్పందించే వేగం. ఉదాహరణకు మనం గూగుల్‌లో (Google Search) ఏదైనా సెర్చ్‌ చేయాలనుకుంటే సెర్చ్‌బార్‌లో సంబంధిత పదాన్ని టైప్‌ చేసి ఎంటర్‌ కీని నొక్కుతాం. మనం ఇచ్చిన ఆ ఆదేశానికి 4జీ నెట్‌వర్క్‌ అయితే.. 60 మిల్లీ సెకన్ల నుంచి 80 మిల్లీసెకన్లలో స్పందించి సెర్చ్‌ చేయడం మొదలుపెడుతుంది. అంటే 4జీలో లాటెన్సీ 60-80 మిల్లీసెకన్లు ఉంటుంది. అదే 5జీలో అయితే ఈ సమయం 5 మిల్లీసెకన్ల కన్నా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వేగం పెరుగుతుంది. 4జీలో గరిష్ఠ డౌన్‌లోడ్‌ వేగం 1జీబీపీఎస్‌ (గిగాబిట్స్‌ పర్‌ సెకన్‌) కాగా.. 5జీలో అది 10 జీబీపీఎస్‌. దీనివల్ల అత్యధిక నాణ్యత, నిడివి కలిగిన వీడియోలను, సినిమాలను సైతం సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 4జీ-5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధానమైన తేడా సమాచార ప్రసార విధానం. 4జీలో సమాచార సంకేతాలు సెల్‌ టవర్ల నుంచి ప్రసారమవుతాయి. 5జీలో అయితే.. ఇందుకు స్మాల్‌ సెల్‌ టెక్నాలజీని వాడుతారు. అంటే.. పిజ్జా బాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్‌ ద్వారా హైబ్యాండ్‌ 5జీ సేవలను  అందుబాటులోకి తెస్తారు. అలాంటి బాక్సులను అమర్చలేని చోట, తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లున్న చోట.. సెల్‌ టవర్లనే వినియోగిస్తారు.

Read more