59 శాతానికి విత్తలోటు

ABN , First Publish Date - 2022-12-31T03:15:51+05:30 IST

ప్రభుత్వ విత్తలోటు నవంబరు చివరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో 59 శాతాన్ని తాకింది.

 59 శాతానికి విత్తలోటు

న్యూఢిల్లీ: ప్రభుత్వ విత్తలోటు నవంబరు చివరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో 59 శాతాన్ని తాకింది. నగదు విలువలో ఇది రూ.9.78 లక్షల కోట్లని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి విత్తలోటు 46.2 శాతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విత్తలోటును జీడీపీలో 6.4 శాతం లేదా రూ.16.61 లక్షల కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యం నిర్దేశించింది.

Updated Date - 2022-12-31T03:15:52+05:30 IST