గుండె జబ్బు ఔషధం ధర 50% తగ్గింపు: జేబీ ఫార్మా

ABN , First Publish Date - 2022-12-15T01:23:17+05:30 IST

గుండెపోటు (హార్ట్‌ ఫెయిల్యూర్‌) ఔషధం ‘అజ్మార్డా’ ధరను జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ దాదాపు 50 శాతం మేరకు తగ్గించింది...

గుండె జబ్బు ఔషధం ధర 50% తగ్గింపు: జేబీ ఫార్మా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గుండెపోటు (హార్ట్‌ ఫెయిల్యూర్‌) ఔషధం ‘అజ్మార్డా’ ధరను జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ దాదాపు 50 శాతం మేరకు తగ్గించింది. ఈ ఔషధంలో పేటెంటెడ్‌ మాలిక్యూల్‌ సక్యుబుట్రిల్‌-వాల్సార్టాన్‌ ఉంటుంది. ధర తగ్గించిన తర్వాత 50 ఎంజీ టాబ్లెట్‌ ధర రూ.78 నుంచి రూ.39.6కు తగ్గుతుందని జేబీ ఫార్మా ప్రెసిడెంట్‌ దిలీప్‌ సింగ్‌ రాథోర్‌ తెలిపారు. గుండెపోటు కేసుల్లో 23.4 శాతం తెలంగాణలో ఉన్నాయని.. ధర తగ్గింపు వల్ల సామాన్యులకు ఔషధం మరింత అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గుండె పోటును ముందుగానే గుర్తించడానికి దేశవ్యాప్తంగా జేబీ ఫార్మాకు 300కు పైగా హార్ట్‌ ఫెయిల్యూర్‌ క్లినిక్‌లు ఉన్నాయని.. తెలంగాణ 20కి పైగా క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

Updated Date - 2022-12-15T01:23:21+05:30 IST