40 వసంతాల ఇన్ఫోసిస్‌

ABN , First Publish Date - 2022-12-15T01:29:39+05:30 IST

దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. పట్నీ కంప్యూటర్స్‌లో పనిచేసిన ఆర్‌ నారాయణ మూర్తి సహా...

40 వసంతాల ఇన్ఫోసిస్‌

దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. పట్నీ కంప్యూటర్స్‌లో పనిచేసిన ఆర్‌ నారాయణ మూర్తి సహా నందన్‌ నీలేకని, ఎస్‌ గోపాలకృష్ణన్‌, ఎస్‌డీ శిబులాల్‌, కే దినేశ్‌, ఎన్‌ఎ్‌స రాఘవన్‌, అశోక్‌ అరోరా కలిసి ఇన్ఫోసి్‌సను 1981లో ఏర్పాటు చేశారు. నారాయణ మూర్తి తన భార్య సుధా మూర్తి నుంచి రూ.10,000 అప్పుగా తీసుకుని ప్రారంభించిన ఇన్ఫీ.. ఇప్పుడు దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా, ప్రపంచ ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్‌ విలువ రూ.6.65 లక్షల కోట్లు. ఈ సెప్టెంబరు చివరినాటికి ఇన్ఫీలో 3.45 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు.

Updated Date - 2022-12-15T01:29:43+05:30 IST