PhoneRate: 2007 నాటి పాత ఫోన్ రూ.32 లక్షలు పలికింది.. అంతరేటుపెట్టి ఎందుకు కొన్నారో తెలుసా..
ABN , First Publish Date - 2022-10-18T01:27:34+05:30 IST
ఒక ఫోన్ ఏకంగా రూ.32,31,791 (డాలర్లు 39,339) ధర పలికిందంటే నమ్మశక్యమా ?.. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా నిజం.
ఒక ఫోన్ ఏకంగా రూ.32,31,791 (డాలర్లు 39,339) ధర పలికిందంటే నమ్మశక్యమా ?.. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా నిజం. 2007లో విడుదలైన ఓజీ వెర్షన్ ఐఫోన్ (iPhone) ఒకదాన్ని వేలం వేయగా ఊహించని భారీ ధరపలికింది. ఏకంగా 60 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. 2007లో ఈ ఫోన్ విడుదలైనప్పుడు కేవలం 499 - 599 డాలర్లు (రూ.40 వేల నుంచి రూ.50 వేలు) మాత్రమే ఉండగా ఇప్పుడు ఏకంగా 39,339 డాలర్లకు(రూ.32,31,791) అమ్ముడుపోయింది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఎల్సీజీ ఆక్షన్స్ (LCG Auctions) దీనిని దక్కించుకుంది. ఈ వేలం ఆదివారం జరిగింది.
అయితే ఈ ఫోన్‌ను విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఓపెన్ చేయలేదని నిర్వాహకులు చెప్పారు. ఫోన్ పనితీరు చాలాబావుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. 2-మెగా పిక్సెల్ కెమెరా, 4/8 జీబీ స్టోరేజీ, టచ్ స్ర్కీన్, ఓ వెబ్ బ్రౌజర్ ఉన్నాయి. ఫోన్‌కు ఎలాంటి లోపాలు లేవు. ఇది 2007లో కొత్త ఫోన్ అని, ఇప్పటివరకు ఒక్కసారి కూడా యాక్టివేట్ చేయలేదని వేలం నిర్వాహక సంస్థ తెలిపింది. విలువైన వస్తువుల కోసం సేకరణదారులు, ఇన్వెస్టర్లు విలువైన వస్తువుల కోసం ఎంతలా పోటీపడుతున్నారో ఈ విషయం తెలియజేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.
కాగా 2007లో ఐఫోన్‌ను తొలుత యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్కెట్లో అమితాధరణతో ఒక విప్లవమే తీసుకొచ్చింది. అన్ని మోడళ్ల ఫోన్ల కంటే ఎంతో ప్రత్యేకతను పొందుతూ ప్రామాణికమైన ఫోన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. టైమ్ మ్యాగజైన్ (TIME Magazine) యాపిల్ ఫోన్‌ను ‘2007 ఏడాది ఆవిష్కరణ’గా పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ 2022 నుంచి ఐఫోన్ 14 మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.