అమెజాన్‌లో 20,000 కొలువుల కోతలు!

ABN , First Publish Date - 2022-12-06T01:06:48+05:30 IST

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ఉద్వాసనలు 20,000 చేరుకోవచ్చని కంప్యూటర్‌ వరల్డ్‌ తాజా కథనం పేర్కొంది...

అమెజాన్‌లో 20,000 కొలువుల కోతలు!

టాప్‌ మేనేజర్లనూ సాగనంపనున్న కంపెనీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ఉద్వాసనలు 20,000 చేరుకోవచ్చని కంప్యూటర్‌ వరల్డ్‌ తాజా కథనం పేర్కొంది. అమెజాన్‌ 10,000 మందిని తొలగించవచ్చంటూ గత నెలలో వెలువడిన అంచనాల కంటే రెట్టింపు ఇది. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ కార్మికులు, సాంకేతిక సిబ్బంది, కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి టాప్‌ మేనేజర్ల వరకు అన్ని స్థాయిల్లోనూ తీసివేతలుండవచ్చని కంప్యూటర్‌ వరల్డ్‌ కథనం పేర్కొంది. 20,000 కొలువుల కోతలు కంపెనీ కార్పొరేట్‌ సిబ్బందిలో 6 శాతానికి సమానం. కాగా, ప్రపంచవ్యాప్తంగా సంస్థకున్న 15 లక్షల మంది సిబ్బందిలో 1.3 శాతానికి సమానం. కరోనా సంక్షోభ కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌, డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరగడంతో అమెజాన్‌ భారీగా నియామకాలు చేపట్టింది. ఆర్థిక మందగమనంతోపాటు మాంద్యం ముప్పు పొంచి ఉండటంతో అమెజాన్‌ సహా పలు అమెరికన్‌ కంపెనీలు వ్యయాల నియంత్రణపై దృష్టిసారించాయి. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను వీలైనంతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.

Updated Date - 2022-12-06T01:06:59+05:30 IST