జగన్‌ పాలనకు చరమగీతం పాడాలి: వైవీబీ

ABN , First Publish Date - 2022-10-18T09:53:59+05:30 IST

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో జగన్‌రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో

జగన్‌ పాలనకు చరమగీతం పాడాలి: వైవీబీ

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో జగన్‌రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించడం పట్ల తెలుగువారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటర్‌ కోమటి జయరాం, మిర్చి యార్డు మాజీ చైౖర్మన్‌ మన్నం సుబ్బారావు, తానా పూర్వ అధ్యక్షుడు సతీష్‌ వేమన, బోయపాటి వెంకటరమణ, డి.వి.శేఖర్‌, ప్రొఫెసర్‌ నరేన్‌ కొడాలి, రవి మందలపు, శ్రీనివాస్‌ కూకట్ల, భాను మాగులూరి తదితరులు మాట్లాడారు. 

Read more