Kodali Nani Jr NTR Rare Photo: కొడాలి నాని ఒడిలో జూనియర్ ఎన్టీఆర్ కాలు.. అప్పుడలా.. ఇప్పుడేమో..

ABN , First Publish Date - 2022-08-25T01:59:00+05:30 IST

కొందరు స్నేహితులను చూసినప్పుడు ‘ఫ్రెండ్స్ అంటే వీళ్లలా ఉండాల్రా’ అనేంత అసూయ కలుగుతుంది. వాళ్లలో ఏ ఒక్కరు ఒంటరిగా కనిపించినా ‘నీ జిగిరీ దోస్త్‌లు ఏర్రా’ అని తారసపడినవాళ్లు..

Kodali Nani Jr NTR Rare Photo: కొడాలి నాని ఒడిలో జూనియర్ ఎన్టీఆర్ కాలు.. అప్పుడలా.. ఇప్పుడేమో..

కొందరు స్నేహితులను చూసినప్పుడు ‘ఫ్రెండ్స్ అంటే వీళ్లలా ఉండాల్రా’ అనేంత అసూయ కలుగుతుంది. వాళ్లలో ఏ ఒక్కరు ఒంటరిగా కనిపించినా ‘నీ జిగిరీ దోస్త్‌లు ఏర్రా’ అని తారసపడినవాళ్లు అడుగుతుంటారు. వాళ్లు కలిసి కనిపించకపోతే ఎదుటి వాళ్లు కూడా ఏదో వెలితిగా భావిస్తుంటారు. స్నేహంలో అంత గొప్ప అనుబంధం ఉంది.


టాలీవుడ్‌లో అలాంటి స్నేహితులగానే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) గురించి అప్పట్లో చెప్పుకునేవాళ్లు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కొడాలి నాని (Kodali Nani) ఫ్రెండ్‌షిప్ గురించి టాలీవుడ్‌లో (Tollywood) తెలియని వారుండరు. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) కార్యక్రమంలో తాను ప్రాణాలిచ్చే స్నేహితుల్లో కొడాలి నాని పేరు కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడంటే ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం (Jr ntr Kodali Nani Friendship) ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో (Kodali Nani YCP) ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు (Jr NTR Politics) దూరంగా ఉంటూ వరుస సినిమాలతో టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. అలాంటి ఈ సమయంలో ఒక అరుదైన ఫొటో సోషల్ మీడియాలో తాజాగా హల్‌చల్ చేస్తోంది. ఆ ఫొటోలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఎంత స్నేహంగా ఉండేవాళ్లో ఈ ఒక్క ఫొటో చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కొడాలి నాని కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంటే.. కొడాలి నాని ఒడిలో కాలు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ మరో కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆ ఫొటోను చూస్తుంటే ‘సుబ్బు’ సినిమా షూటింగ్ గ్యాప్‌లో తీసిన ఫొటోలా ఉందని ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడ్డారు. ఆ ఫొటో ఏ సినిమా సమయంలో తీసి ఉంటారనే విషయం పక్కనపెడితే కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారో ఆ ఫొటో చెప్పకనే చెప్పేసింది. అయితే.. రాజకీయం ఎంతటి మిత్రుల మధ్యనైనా దూరం పెరిగేలా చేస్తుంది. అలా ఈ ఇద్దరు మిత్రులు చెరొక దారిలో ముందుకెళుతున్నారు. కానీ.. ఇటీవల అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్‌ల (Amit Shah Jr NTR Meet) భేటీపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ ఇద్దరి స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది. ‘ఆర్ఆర్‌ఆర్’ (RRR) సినిమాలో ఎన్టీఆర్ నటనకు మెచ్చి అమిత్‌షా డిన్నర్‌కు ఆహ్వానించి ఉంటారని తానైతే అనుకోవడం లేదని కొడాలి నాని చెప్పడం, బీజేపీకి ఎన్టీఆర్ మద్దతు తెలిపితే ఎంతోకొంత ఆ పార్టీ కచ్చితంగా బలపడుతుందని కొడాలి నాని అభిప్రాయపడటంతో జూనియర్‌ ఎన్టీఆర్‌పై కొడాలి సానుకూల వైఖరి మరోసారి బయటపడినట్టయింది.జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని గతంలో ఎంత స్నేహంగా ఉండేవారన్న విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతంలో కూడా వారిద్దరేమీ బద్ధ శత్రువులు కారు. అలా అని స్నేహాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా లేవు. టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై సదరు కొడాలి నానితో పాటు వైసీపీ నేతలు అభాండం వేసి అవమానించిన సందర్భంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ హితబోధ లాంటి వీడియో విడుదల చేశాడే తప్ప అంత ఘాటుగా ఏమీ స్పందించలేదు. నందమూరి బాలకృష్ణతో సహా నందమూరి కుటుంబం అంతా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వార్నింగ్ ఇస్తే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంత సుతి మెత్తగా స్పందించడం ఏంటని వర్ల రామయ్య లాంటి సీనియర్ టీడీపీ నేతలు కూడా తప్పుబట్టారు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ వర్ల రామయ్య వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని కొడాలి నానిపై విరుచుకుపడిందేమీ లేదు. కొడాలి నాని కూడా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసే విమర్శల్లో అప్పుడప్పుడూ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తావన తీసుకొచ్చి మరీ తన స్నేహితుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేవారు. జూనియర్ ఎన్టీఆర్‌‌ను రాజకీయంగా రానివ్వకుండా అడ్డుకుంటారని కూడా కొడాని నాని గతంలో వ్యాఖ్యానించారు. ఇలా.. ఆ పాత స్నేహమో ఏమో తెలియదు గానీ జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఇప్పటికీ మిత్రులుగా స్నేహాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపించకపోయినా రాజకీయ శత్రుత్వం కూడా లేనట్టుగానే వ్యవహరిస్తుండటం గమనార్హం.ఇక.. వైరల్ అవుతున్న ఈ అరుదైన ఫొటోలోని మరో వ్యక్తి వల్లభనేని వంశీ. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి మద్దతు తెలుపుతున్న వంశీ కూడా జూనియర్‌కు మంచి మిత్రుడే. ఆ సాన్నిహిత్యంతోనే జూనియర్ ఎన్టీఆర్‌తో వినాయక్ తీసిన ‘అదుర్స్’ సినిమాకు వల్లభనేని వంశీ నిర్మాతగా కూడా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్, వల్లభనేని వంశీ ఈ మధ్య ఒకరికొకరు ఎదురుపడిన సందర్భాలు కూడా అంతగా లేవనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకొచ్చి 2024 ఎన్నికల్లో ముందడుగు వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో, సమీకరణాలు ఎలా మారతాయో తెలియదు గానీ ప్రస్తుతానికైతే వంశీ, జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పటి మిత్రులే. ఏదేమైనా.. వల్లభనేని వంశీ, కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ కావడం మాత్రం ఆసక్తికర చర్చకు అవకాశం ఇచ్చింది. అప్పటి వీరి స్నేహ బంధాన్ని గుర్తు చేసింది.

సాంబశివారెడ్డి పేరం

Read more