వైఎస్ వివేకా హత్య కేసు... దస్తగిరి స్టేట్మెంట్‌లో కొత్త పేర్లు

ABN , First Publish Date - 2022-02-23T01:11:51+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసు... దస్తగిరి స్టేట్మెంట్‌లో కొత్త పేర్లు

వైఎస్ వివేకా హత్య కేసు... దస్తగిరి స్టేట్మెంట్‌లో కొత్త పేర్లు

కడప: వైఎస్ వివేకాహత్య కేసులో నిందితుడు దస్తగిరి సీబీఐకి స్టేట్మెంట్‌ రాచిచ్చాడు. దస్తగిరి స్టేట్మెంట్‌లో కొత్త కోణం, వెలుగులోకి కొత్తపేర్లు వచ్చాయి. తనని భరత్‌యాదవ్‌ కలిసినట్టుగా దస్తగిరి పేర్కొన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతారని, తోటలోకి రమ్మంటున్నారని భరత్‌యాదవ్‌ చెప్పాడని తెలిపారు. సీబీఐ అధికారులు పిలిచారు.. నేను వెళ్తున్నానని దస్తగిరి చెప్పినట్లు వెల్లడించారు.  అలాగే మరోసారి ఫోన్‌లో ఇంటి వెనక ఉండే హెలిప్యాడ్ దగ్గరకు భరత్ రమ్మన్నాడని దస్తగిరి పేర్కొన్నారు. అక్కడికి భరత్‌యాదవ్‌తో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డిలు వచ్చారని తన స్టేట్ మెంట్లో పేర్కొన్నాడు.


వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకరరెడ్డిలు పంపించారంటూ నువ్వు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలంలో చెప్పిన అంశాలు చెబితే నీకు మంచి ఆఫర్ అన్నట్లు వివరించాడు. 10.20 ఎకరాల భూమి ఇస్తాం, ఎంతడబ్బు కావాలో చెప్పాలని భరత్, అడ్వకేట్ ఓబుల్‌రెడ్డి అడిగారని స్టేట్మెంట్‌లో  దస్తగిరి పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 25న సీబీఐ ఎదుట, ఆగస్టు 31న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్‌  దస్తగిరి ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్ 30న తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు కూడా చేశాడు. 

Updated Date - 2022-02-23T01:11:51+05:30 IST