శరీరంపై ప్రమిదలతో యోగా!

ABN , First Publish Date - 2022-12-07T02:45:59+05:30 IST

శరీరంపై అమర్చిన ప్రమిదలు వెలుగుతుండగా ఆ చిన్నారులు పద్మాసనం, వజ్రాసనం, నారాయణాసనం వేస్తూ కార్తీక దీపోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు.

శరీరంపై ప్రమిదలతో యోగా!

రీరంపై అమర్చిన ప్రమిదలు వెలుగుతుండగా ఆ చిన్నారులు పద్మాసనం, వజ్రాసనం, నారాయణాసనం వేస్తూ కార్తీక దీపోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా రాజపాళయంలోని పతంజలి యోగా కేంద్రం ఈ కార్యక్రమానికి వేదిక అయ్యింది. విద్యార్థులు నరేష్‌, రాఘవ్‌, ఇసక్కిముత్తుపాండి, సంజన మొత్తం 50 ప్రమిదలను తమ శరీరాలపై పెట్టుకుని యోగాసనాలు వేశారు. - చెన్నై, ఆంధ్రజ్యోతి

Updated Date - 2022-12-07T02:46:35+05:30 IST