రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దు: రఘురామ

ABN , First Publish Date - 2022-03-18T08:38:01+05:30 IST

రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దు: రఘురామ

రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దు: రఘురామ

న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడిగితే అంత అప్పులు ఇవ్వొద్దని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగ కార్యదర్శి సోమ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశానని వైసీపీ ఎంపీ రఘురామరాజు వెల్లడించారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని, కార్పొరేషన్ల పేరిట ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారని చెప్పానని పేర్కొన్నారు. 

Read more