YCP MLC ఉదయ భాస్కర్ బరితెగింపు
ABN , First Publish Date - 2022-05-21T19:18:52+05:30 IST
హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ బరితెగింపులకు పాల్పడ్డాడు.

కాకినాడ: హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ బరితెగింపులకు పాల్పడ్డాడు. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి బెదిరింపులకు దిగాడు. హత్య కాదని చెప్పాలంటూ తన మనుషులతో ఒత్తిళ్లు తీసుకువచ్చాడు. భయానికి గురైన మృతుడి భార్య, తల్లిదండ్రులు ఇళ్లు ఖాళీ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తమకు ప్రాణహాని ఉందంటూ మృతుడి సోదరుడు ఏబీఎన్‌కు తెలియజేశాడు. మరోపక్క కుటుంబాన్ని దారికి తీసుకురాడానికి కాకినాడ కీలకనేత బేరసారాలు ఆడుతున్నారు. కోటి వరకు ఇస్తామని.. మృతిపై అనుమానాలు లేవని చెప్పాలంటూ కుటుంబంపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు.