-
-
Home » Andhra Pradesh » ycp mla vellampalli srinivas vijayawada andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Vellampalli srinivas: ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే వెల్లంపల్లి హల్‌చల్
ABN , First Publish Date - 2022-09-30T18:04:16+05:30 IST
ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హల్‌చల్ చేశారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli srinivas) హల్‌చల్ చేశారు. తన వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలలో ఎమ్మెల్యే (YCP MLA) ఇంద్రకీలాద్రికి వచ్చారు. అయితే వెల్లంపల్లి (YCP Leader) వాహనాన్నిపైకి అనుమతించిన పోలీసులు... మిగతా వాహనాలను నిలిపివేశారు. దీంతో కారు దిగి మిగతా వాహనాలను పైకి పంపాలంటూ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యే వాహనంతో పాటు మిగిలిన మూడు వాహనాలను కొండపైకి పంపించారు. వాహనాల్లో వైసీపీకి చెందిన నేతలు కొండపల్లి బుజ్జి, కొనకళ్ళ విద్యాధర రావు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.