YCP MLA Anil Kumar Yadav: మంత్రి పదవి కోల్పోయాక వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ పరిస్థితి మరీ ఇలా అయిందేంటో..!

ABN , First Publish Date - 2022-08-24T23:07:09+05:30 IST

వైసీపీ అధినేత జగన్‌‌ను (ysrcp jagan) ఎవరైనా విమర్శిస్తే ఒంటి కాలిపై లేచే వైసీపీ ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (YCP Ex Minister Anil Kumar Yadav) ఒకరు. నెల్లూరు నగర ఎమ్మెల్యే (Nellore City MLA) అయిన అనిల్‌ (MLA Anil) పరిస్థితి..

YCP MLA Anil Kumar Yadav: మంత్రి పదవి కోల్పోయాక వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ పరిస్థితి మరీ ఇలా అయిందేంటో..!

నెల్లూరు: వైసీపీ అధినేత జగన్‌‌ను (ysrcp jagan) ఎవరైనా విమర్శిస్తే ఒంటి కాలిపై లేచే వైసీపీ ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (YCP Ex Minister Anil Kumar Yadav) ఒకరు. నెల్లూరు నగర ఎమ్మెల్యే (Nellore City MLA) అయిన అనిల్‌ (MLA Anil) పరిస్థితి మంత్రి పదవి కోల్పోయాక నానాటికీ తీసికట్టుగా మారుతోంది. వర్గపోరుతో అనిల్ సతమతమవుతున్నారు. ఇన్నాళ్లూ తోడుగా నిలిచిన వాళ్లే అనిల్‌కు చుక్కలు చూపిస్తున్నారు. నెల్లూరులో వైసీపీ వర్గ పోరు ఉద్రిక్తంగా మారింది. తన వర్గీయులను అరెస్ట్ చేశారని డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ (Deputy Mayor Roopkumar) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఎమ్మెల్యే అనిల్‌కు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్ ఈ పరిణామాల నేపథ్యంలో స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో ఉంటూ అనిల్‌ మమ్మల్ని ఇబ్బందిపెడితే ఊరుకోమని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో (2024 Elections) ఏ విధంగా గెలవాలనేది ఎమ్మెల్యే అనిల్‌ ఆలోచించాలని హితవు పలికారు. కానీ ఈ విధంగా వెన్నుపోటు పొడవడం కాదని రూప్‌కుమార్ (Roopkumar Nellore) మండిపడ్డారు. తమ కార్యకర్తలను అరెస్ట్‌ చేయిస్తే 5 నిమిషాల్లో బయటకు తీసుకొచ్చానని.. ఎమ్మెల్యే అనిల్‌ (MLA Anil) పరువు ఇప్పుడేమైందని డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్ ప్రశ్నించారు. అనిల్‌ తమతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని రూప్‌కుమార్‌ వార్నింగ్ ఇవ్వడం నెల్లూరు నగర వైసీపీలో (Nellore City YCP) వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టింది.అసలేం జరిగిందంటే..

నెల్లూరు నగర వైసీపీలో ముసలం పుట్టింది. బాబాయ్‌(అనిల్ కుమార్‌), అబ్బాయ్‌(రూప్ కుమార్)ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నగర ఎమ్మెల్యే అనిల్‌తో సయోధ్య కుదరక డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ వేరుకుంపటి పెట్టుకున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి పోటీగా మరో కార్యాలయానికి గత ఆదివారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమమని తెలిసినా సిటీ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, క్యాడర్‌ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీకి చెందిన పలువురు పెద్దలు కూడా పరోక్షంగా రూప్‌కుమార్‌కు సహకరించారు. ఇప్పటికే జిల్లా పార్టీలో కీలక నేతలకు అనిల్‌కు దూరం కాగా, తాజాగా ఆయన రాజకీయ జీవితంలో ప్రతి అడుగులో తోడుగా నడిచిన రూప్‌కుమార్‌ కూడా దూరం కావడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా అనిల్‌ ఒంటరవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.


అనిల్‌ రాజకీయ ఆరంగేట్రం నుంచి ఆయనకు అన్నింటా తోడుగా నిలచిన వ్యక్తి రూప్‌కుమార్‌ యాదవ్‌. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్‌ పక్షాన ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన రూప్‌కు సిటీ నియోజకవర్గంపైన, క్యాడర్‌పైన మంచి పట్టు ఉంది. అనిల్‌కు సంబంధించిన అన్ని రాజకీయ వ్యవహారాలను ఆయనే చక్కబెట్టేవారు. అయితే  కొంత కాలంగా వీరిద్ధరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నారు. అనిల్‌కు పోటీగా పార్టీ కార్యాలయానికి భూమి పూజ  చేయడంతో ఈ విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి.ఎమ్మెల్యే అనిల్‌ రాజకీయ వైరి వర్గాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రూప్‌కుమార్‌కు మద్దతు తెలుపుతుండటంతో అనిల్‌ ఒంటరిగా మిగిలారన్న వాదనకు బలం చేకూరుతోంది. జిల్లాకు చెందిన కీలక నేతలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు అనిల్‌కు మధ్య మంచి సంబంధాలు లేవు. అంతేకాక గత కొంతకాలంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం అనిల్‌ పోకడలు నచ్చక దూరంగానే ఉంటున్నారు. వీరందరి మద్దతు కూడగట్టుకునేందుకు రూప్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక సిటీ విషయానికి వస్తే నుడా చైర్మన్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు, డిప్యూటీ మేయర్‌ రూప్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది.


అనిల్‌కు పోటీగా జరుగుతున్న కార్యక్రమమని తెలిసినా నుడా చైర్మన్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు, క్షేత్రస్థాయి క్యాడర్‌ పెద్దసంఖ్యలో రూప్‌కుమార్‌ ఆహ్వానం మేరకు భూమి పూజకు హాజరయ్యారు. ఇవన్నీ రాజకీయంగా అనిల్‌ ఒంటరి అవుతున్నాడా..!? అన్న చర్చకు ఊపునందించాయి. దీనికి తోడు 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నాని రూప్‌కుమార్‌ సన్నిహితులకు, పార్టీ పెద్దలకు తెలిపినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని, వారం క్రితం సజ్జల రామకృష్ణారెడ్డిని రూప్‌ కలిశారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో అనిల్‌ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందోననే చర్చ ఊపందుకుంది.

Read more