అసత్య ప్రచారాలతో వైసీపీ నేతల పిచ్చి ఆనందం: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2022-10-07T08:50:22+05:30 IST
అసత్య ప్రచారాలతో వైసీపీ నేతల పిచ్చి ఆనందం: బుద్దా వెంకన్న
విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్), అక్టోబరు 6: నందిగామలో హిజ్రాల కేసులో తనకు అవమానం జరిగిందని వైసీపీ సోషల్ మీడియా తనపై విషాన్ని కక్కుతూ పిచ్చి ఆనందాన్ని పొందుతోందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. తనకు హిజ్రాలతో ఎలాంటి ఘర్షణ జరగలేదని, ఇదంతా వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారమని ఖండించారు. జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ పాలనను ప్రజల్లో ఎండగడుతున్నందుకే తనను టార్గెట్ చేసి ఈ విధంగా దుష్ప్రచారం చేసి మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారని, వైసీపీ సోషల్ మీడియా వెకిలి చేష్టలు తన వద్ద సాగవని హెచ్చరించారు.