బెజవాడలో.. నేడే వైసీపీ ‘జయహో బీసీ’
ABN , First Publish Date - 2022-12-07T03:42:21+05:30 IST
వైసీపీ బుధవారం విజయవాడలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనాలను తరలించే బాధ్యతను అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులకు అప్పగించారు.
నేతలకు జనసమీకరణ బాధ్యతలు.. మంత్రులకు టార్గెట్లు
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ బుధవారం విజయవాడలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనాలను తరలించే బాధ్యతను అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులకు అప్పగించారు. మంత్రులకు కూడా జిల్లాలవారీగా ప్రత్యేక టార్గెట్లు పెట్టారు. ఈ సభకు జిల్లాల వైసీపీ అధ్యక్షులు కూడా వస్తుండడంతో.. వారితో, పార్టీ పరిశీలకులతో, సమన్వయకర్తలతో సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై ఈ సందర్భంగా సమీక్షిస్తారు.