వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు: విష్ణువర్దన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-09T20:35:35+05:30 IST

ఈ ప్రభుత్వాన్ని రైతులే బంగాళాఖాతంలో కలుపుతారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు: విష్ణువర్దన్‌రెడ్డి

అమరావతి: ఈ ప్రభుత్వాన్ని రైతులే బంగాళాఖాతంలో కలుపుతారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాలను సీఎం జగన్‌ పోలీసులతో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉత్సవ విగ్రహంలా మారిన వ్యవసాయ మంత్రి కన్నబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న ప్రాజెక్టులను కూడా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా బిజెపి ఉద్యమానికి సిద్ధమైతే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటుందని ద్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మిస్తుంటే రాష్ట్రం భజన చేస్తుందని విమర్శించారు.  వెయ్యి కోట్ల రూపాయలతో చిన్న చిన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2022-03-09T20:35:35+05:30 IST